కలం, వెబ్ డెస్క్ : అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) కు సోషల్ మీడియా వేదికగా హత్య బెదిరింపు రావడం కలకలం రేపింది. రూ.1 కోటి ఇస్తే సీఎంను చంపేస్తానంటూ ఓ వ్యక్తి లైవ్ చాట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. శుక్రవారం నాడు గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ మైదానంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ సోషల్ మీడియాలో కొనసాగుతుండగా ఓ వ్యక్తి రెచ్చిపోయాడు.
తనకు రూ.1 కోటి ఇస్తే హిమంత బిశ్వ శర్మను (Himanta Biswa Sarma) హత్య చేస్తానని దారుణమైన కామెంట్ పెట్టాడు. సీఎం ప్రసంగిస్తున్న లైవ్‌లో ఈ తరహా బెదిరింపు సందేశం కనిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, సైబర్ క్రైమ్ అధికారులు రంగంలోకి దిగారు. టెక్నాలజీ సాయంతో ఆ నిందితుడిని గుర్తించి, అతడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు.
Also Read : విమల్ యాడ్ ఎఫెక్ట్.. బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
Follow Us On: X(Twitter)

