కలం, వెబ్ డెస్క్ : అల్లూరి జిల్లా చింతపల్లిలోని (ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ) (APFDC Chintapalli) కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం అధికారులు చేసిన పని తీవ్ర దుమారం రేపుతోంది.
దేశభక్తి గీతాలు మారుమోగాల్సిన చోట సినిమా పాటలకు అధికారులు స్టెప్పులేశారు. ‘రాను బొంబాయికి రాను’ వంటి జానపద, సినీ గీతాలకు డ్యాన్సులు చేస్తూ వినోదంలో మునిగిపోయారు. పవిత్రమైన జాతీయ జెండా నీడన అధికారులు చేసిన ఈ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను, జాతీయ జెండా గౌరవాన్ని పూర్తిగా విస్మరించి ప్రవర్తించిన APFDC అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : సీఎంను చంపేస్తానంటూ బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు!
Follow Us On: Instagram

