పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించాలి: అమరవేణి నర్సాగౌడ్

కలం, నిర్మల్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Papanna Goud) 376వ జయంతి వారోత్సవాలను ఆగస్టు 18 నుంచి 25వ తేదీ వరకు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని తెలంగాణ గౌడ జనహక్కుల పోరాట సమితి రాష్ట్ర చైర్మన్, మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. సుమారు 350 ఏళ్ల క్రితమే రాచరిక, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ, అధిక పన్నులు, దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ పోరాడారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి మొఘల్ పాలకుల ఆధిపత్యాన్ని సవాల్ చేసి రాజ్యాధికారాన్ని సాధించిన గొప్ప యోధుడని కొనియాడారు.

ఈ నెల 18న ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించనున్నారని, ఆ లోపు జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Papanna Goud) పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గీత కార్మికుల ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. హామీల అమలుపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>