కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రి డాక్టర్ ప్రియాంక (Medico Priyanka) హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ వేగం పెంచింది. ఈ కేసు సమగ్ర దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్ ను నియమిస్తూ ఏపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విచారణను వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. స్థానిక సీఐ వ్యవహారశైలిపై విమర్శలు రావడమే కాకుండా, ప్రారంభంలో ఈ ఘటనను బయటకు రాకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు నాయుడు, బాధ్యుల ఫోన్ కాల్ డేటాతో సహా లోతైన విచారణ జరపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ఈ కేసు విచారణలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన విచారణాధికారికి రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ, ప్రకాష్ నగర్ సీఐ బాజీలాల్ పూర్తి స్థాయిలో సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రియాంక (Medico Priyanka) హత్య వెనుక ఉన్న అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.
Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!
Follow Us On: Sharechat

