జీఆర్ఎంబీ భేటీ వాయిదా.. కేఆర్ఎంబీ సమావేశం యథాతథం

కలం, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎల్లుండి జరగాల్సిన జీఆర్ఎంబీ (GRMB) సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమాశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ గోదావరి నీటి పంపకాలపై ఎల్లుండి నిర్వహింపదలచుకున్న జీఆర్ఎంబీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సమావేశంపై తదుపరి తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు జీఆర్ఎంబీ బోర్డు వెల్లడించింది.

అయితే రేపు నిర్వహించదలచిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం యధాతథంగా జరగనుంది. హైదరాబాద్‌‌లోని జలసౌధలో జరగనున్న ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రులు, ఉన్నాతాధికారులు పాల్గొనున్నారు. కృష్ణా నీటి వాటాలు, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణాలో ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి ఎగువన ఉన్న నీళ్లన్నీ తామేనని, ఏపీకి చుక్క కూడా లేవని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కేఆర్ఎంబీ సమావేశంపై ఆసక్తి నెలకొంది.

Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>