అయితంపూడి లాకుల వద్ద విషాదం: కాలువలోకి దూసుకెళ్లిన కారు!

కలం, వెబ్ డెస్క్​ : పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం (Aithampudi Accident) చోటుచేసుకుంది. ఒక కారు వేగంగా వచ్చి అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.

నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ స్నేహితుడి సోదరుడి వివాహ వేడుకకు తూర్పుగోదావరి జిల్లా పెరవలి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

కారు నీటిలో మునిగిపోతున్న సమయంలో మట్ట సంతోష్ అనే విద్యార్థి ఈత కొడుతూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగాడు. మిగిలిన నలుగురు విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక గజ ఈతగాళ్లు కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చెందుతున్నారు.

గల్లంతైన విద్యార్థుల గుర్తింపు వివరాలపై స్థానికంగా వివిధ పేర్లు బయటకు వచ్చాయి. నాగబత్తుల సూర్య, నాగిరెడ్డి బన్ను, సంతోష్, చరణ్ అనే పేర్లతో పాటు పోతుల లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి దుశ్యంత్, సాయి సూర్య అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read : బోనాల వివాదం: ట్రోలర్లకు ఫరియా స్ట్రాంగ్ కౌంటర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>