కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆకుపాముల దగ్గర జాతీయ రహదారి -65పై కాసేపటి క్రితం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు ఢీ కొన్నాయి. ఏల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసి సూపర్ లగ్జరీ బస్సు , ముందు వైపు నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీ కృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.
అయితే ఘటన జరిగిన సమయంలో రెండు బస్సుల్లో మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

