కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు (Zahirabad MLA Manik Rao) తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. వేడుకల్లో భాగంగా జెండాను ఆవిష్కరించిన అనంతరం, జెండా తలకిందులుగా (ఆకుపచ్చ రంగు పైన, కాషాయ రంగు కింద) ఉండటాన్ని అక్కడ ఉన్నవారు గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాణిక్ రావు, కార్యకర్తలు పొరపాటును సరిదిద్ది జెండాను సవరించి తిరిగి గౌరవప్రదంగా ఎగురవేశారు.

