జాతీయ పర్వదినాలు దేశ గౌరవానికి ప్రతీక : సంజీవ్ ముదిరాజ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జాతీయ పర్వదినాలు దేశ గౌరవానికి ప్రతీకలని, జెండా ఆవిష్కరణ మనందరికీ గర్వకారణం అని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం డీసీసీ చీఫ్ (Sanjeev Mudiraj) మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బెక్కరి మధుసూదన్ రెడ్డి, వేముల కృష్ణయ్య, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు రాములు యాదవ్, సాయిబాబా, ధోమ పరమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్‌పీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్లు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాష్ట్రపతి నోట తెలుగు మాట.. పద్యం చెబుతూ!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>