కడ్తాల్‌లో రోడ్డు ప్రమాదం.. రేషన్ డీలర్ మృతి

కలం, నిర్మల్: సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలోని అయ్యప్ప ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) రేషన్ డీలర్ మృతి చెందగా, ఆయన తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాక్‌పట్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గోగుర్ల లక్ష్మీనర్సయ్య తన తమ్ముడు గోగుర్ల నరేందర్‌తో కలిసి త్రీ వీలర్ హ్యాండీక్యాప్డ్ మోటార్ సైకిల్‌పై నిర్మల్ వైపు వెళ్తున్నారు. కడ్తాల్ అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లక్ష్మీనర్సయ్య, నరేందర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి లక్ష్మీనర్సయ్య అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నరేందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గోపి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>