కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్(Nirmal Collector) భవేష్ మిశ్రా (Bhavesh Mishra) శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించి అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు అతిథులను ఆహ్వానించాలని కలెక్టర్ సూచించారు.
వేదికను అందంగా అలంకరించాలని, దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వేడుకలు జరుగుతున్నంతసేపు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టెంట్, షామియానా, తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అంబులెన్సును అందుబాటులో ఉంచడంతో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ (Nirmal Collector Bhavesh Mishra) సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్, అర్బన్ తహసిల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
Also Read : విక్టరీ వెంకటేశ్ ఫస్ట్ లుక్ వైరల్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్!
Follow Us On: Sharechat

