కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్, ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ (Constable Sai Kumar) ఆత్యహత్య చేసుకోవడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే ఉరేసుకోవడంతో సాయికుమార్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆత్యహత్యగా చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
సోమవారం ఏసీపీ కార్యాలయంపై సాయికుమార్ కుటుంబ సభ్యులు దాడి చేసి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, నిరసనకారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తక్షణమే సాయి కుమార్ సెల్ ఫోన్‌ను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

