2027 వరల్డ్ కప్‌పై షహీన్ షాకింగ్ కామెంట్స్!

కలం, స్పోర్ట్స్​ : 2027 వన్డే వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నపై ఆ జట్టు కెప్టెన్ షహీన్ షా ఆఫ్రిది (Shaheen Afridi) కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి తానే కెప్టెన్‌గా ఉన్నానని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2027 వరల్డ్ కప్ వరకు తన కెప్టెన్సీని ఖరారు చేసిందా అని షహీన్‌ను ప్రశ్నించారు. దీనికి ప్రస్తుతానికి తానే కెప్టెన్ అని బదులిచ్చాడు. అయితే పాకిస్థాన్ కెప్టెన్సీపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు మళ్లీ అన్ని ఫార్మాట్ల నాయకత్వం అప్పగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీనిపై పీసీబీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

షహీన్ మాత్రం కెప్టెన్సీపై చర్చ కంటే వరల్డ్ కప్ సన్నాహాలపైనే దృష్టి పెట్టాడు. ఆగస్టు 11 నుంచి 18 వరకు నేషనల్ ఛాంపియన్స్ కప్ జరగనుంది. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ దేశవాళీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ద్వారా జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను గుర్తించవచ్చని షహీన్ భావిస్తున్నాడు. వరల్డ్ కప్‌కు ముందు గాయాల కారణంగా ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంటుందని తెలిపాడు. అందుకే ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచుకోవడం ముఖ్యమని పేర్కొన్నాడు.

ఆటగాళ్లు తమకు కేటాయించిన స్థానాల్లో ఆడే అవకాశం ఈ టోర్నీలో లభిస్తుందని చెప్పాడు. వారి ఫామ్‌తో పాటు ఫిట్‌నెస్‌ను కూడా పరిశీలిస్తామని తెలిపాడు. షహీన్ 2025 అక్టోబర్‌లో పాకిస్థాన్ వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. మహ్మద్ రిజ్వాన్ స్థానంలో అతడిని నియమించారు. ఇక 2027 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు కీలక సిరీస్‌లు ఉన్నాయి. దేశవాళీ టోర్నీతో పాటు రాబోయే మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలెక్టర్లు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కెప్టెన్సీపై స్పష్టత లేకపోయినా, షహీన్ మాత్రం వరల్డ్ కప్ సన్నాహాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>