కలం, వెబ్ డెస్క్: భుజానికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కిమ్స్ హాస్పిటల్స్, హైదరాబాద్లో రేపు (బుధవారం) భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. వైద్యుల బృందం ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకునేలా చికిత్స అందిస్తోంది. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్కి తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సి ఉండటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Also Read : వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
Follow Us On: Instagram

