బుర్రవాగు స్టేజీ వద్ద ఘోరం.. కారు ఢీకొని బీహార్ కార్మికుడు స్పాట్ డెడ్!

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లా పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజీ సమీపంలో జాతీయ రహదారి-44పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రహదారి వంతెన పనులు చేస్తున్న కార్మికుడిని కారు ఢీకొట్టడంతో అదుపుతప్పి వంతెన మధ్యలోనే బోల్తా పడింది.

ఈ ఘటనలో బీహార్‌కు చెందిన కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>