కలం, వెబ్ డెస్క్ : సర్ ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఓటును కోల్పోయారు. బెంగళూరులో తన ఓటును తొలగించడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఓటు తొలగించారంటూ వీడియోలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరులో తొలగించిన 65 లక్షల ఓటర్లలో తాను ఒకడిని అని చెప్పుకొచ్చారు.
బెంగళూరులోనే పుట్టి పెరిగాను.. ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసినా తన ఓటును తొలగించడం విడ్డూరంగా ఉందని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ‘మీకు ఓటు వేయనివారి ఓటు హక్కును తొలగించే అధికారం ఉంటే.. మిమ్మల్ని గద్దే దింపకుండా ఆపగలరా’ అంటూ మోదీకి ప్రకాశ్ రాజ్ సవాల్ విసిరారు. ఇప్పుడే అసలు ఆట మొదలైందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, ప్రకాశ్ రాజ్ కు నాలుగు చోట్ల ఓటు హక్కు ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈసీ బెంగళూరులో ఓటును తొలగించినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రకాశ్ రాజ్ సమయం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. కాగా, ప్రకాశ్ రాజ్ ఓటు తొలగింపుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

