కలం, కరీంనగర్ : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా అభియాన్ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సునీల్ రావు (Sunil Rao) సోమవారం తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సునీల్ రావు (Sunil Rao) మాట్లాడుతూ.. దేశ ప్రజలందరిలో జాతీయ భావాన్ని, దేశభక్తిని మరింతగా పెంపొందించే అద్భుతమైన కార్యక్రమం హర్ ఘర్ తిరంగా అని అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై విధిగా తమ ఇళ్లపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ఈనెల 10న ప్రారంభమై 14 వరకు కొనసాగుతాయన్నారు.
Also Read : రైతులకు ప్రతి నెలా రూ.5 వేల కోట్లు: మంత్రి పొంగులేటి
Follow Us On: X(Twitter)

