సంగారెడ్డి నుంచే స్మార్ట్ రేష‌న్ కార్డులు పంపిణీ.. జగ్గారెడ్డి భారీ ఏర్పాట్లు

క‌లం, మెద‌క్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1 కోటి 5 లక్షల మందికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు అందించబోతున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన నూతన ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ (Smart Ration Cards) పంపిణీ ఈ నెల 15న రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ప్రారంభంకానుంది. ఈ మేరకు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సోమవారం అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. తారా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌తోపాటు బహిరంగ సభ వేదికైన అంబేడ్కర్ స్టేడియాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అరకొర రేషన్ కార్డులతో ప్రజలు నిర్లక్ష్యానికి గురయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 1 కోటి 5 లక్షల మందికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు (Smart Ration Cards) అందించబోతున్నామని స్పష్టం చేశారు. నూత‌న‌ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నిర్ణయం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నామన్నారు. సుమారు 50 వేల మంది జనసమీకరణతో ఈ బహిరంగ సభను సక్సెస్ చేసేలా ఏర్పాట్లు వేగవంతం చేశామని జగ్గారెడ్డి తెలిపారు.

Also Read : ఫిఫాలో సంక్షోభం.. ఇన్ఫాంటినోపై సమాఖ్యల ధ్వజం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>