కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Aswaraopeta) మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు సోమవారం బీఆర్‌ఎస్‌లో (BRS) చేరాయి. కావడిగుండ్ల, కాలాని గ్రామాలకు చెందిన ఆయా కుటుంబాల సభ్యులు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామస్థులు మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన హామీలు, మాయమాటలు నమ్మి మోసపోయామని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు మెచ్చా నాగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపించడమే తమ లక్ష్యమని తెలిపారు.
అనంతరం మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేయించి ప్రారంభించిన అభివృద్ధి పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని ఆరోపించారు. మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు సైతం బీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జూపల్లి రమణారావు, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : హీరో యశ్ కోసం ఆ రూల్‌ను బ్రేక్ చేసిన నయనతార
Follow Us On: Sharechat

