కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్

కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) జిల్లావ్యాప్తంగా సోమవారం రోజున ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) అభియాన్ ప్రోగ్రాం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం తన స్వగృహంపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. మన జాతీయ పతాకం దేశానికి, మనందరికీ గర్వకారణమని, దేశభక్తిని కలిగే విధంగా నిరంతర ప్రేరణ శక్తిని ఇస్తుందని తెలిపారు.

2022 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి, ‘వికసిత భారత్’ నిర్మాణానికి మద్దతుగా నిలిచి, మనందరి ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : సంగారెడ్డి నుంచే స్మార్ట్ రేష‌న్ కార్డులు పంపిణీ.. జగ్గారెడ్డి భారీ ఏర్పాట్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>