మత్స్యకారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) శుభవార్త అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం (GAIS) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు.

మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 18 నుంచి 70 ఏళ్ల వయసు గల 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు.

రూ.79.96 చొప్పున ఒక్కో లబ్దిదారుడికి బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లిస్తుందని మంత్రి వాకిటి తెలిపారు.

పథకం ద్వారా చేకూరే ప్రయోజనాలు..

1.ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే – రూ.5.00 లక్షలు
2.శాశ్వత సంపూర్ణ వైకల్యానికి – రూ.5.00 లక్షలు
3.శాశ్వత పాక్షిక వైకల్యానికి – రూ.2.50 లక్షలు
4.ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందితే – గరిష్ఠంగా రూ.25,000 వరకు వైద్య సహాయం

Also Read : పొంగులేటి Vs కౌశిక్ రెడ్డి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో వాగ్వాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>