వలిగొండలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో సోమవారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (Pailla Shekar Reddy) జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జానీ అప్రోజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరిట ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, నాయకులు సురకంటి వెంకట్ రెడ్డి, పల్సం రమేష్, కొమురెల్లి సంజీవరెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, ఆవుల నరసింహ, బల్గూరి నరేష్ రెడ్డి, కాసుల పెద్దలు, శ్రీరాముల నాగరాజు, బొడ్డుపల్లి కృష్ణ, గంగారం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ‘నరేంద్ర’ పేరుపై పాక్ బాక్సర్ ఏడుపు.. మోదీ నవ్వులు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>