జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలు.. కీలక వ్యక్తి అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ ఎల్.ఖియాంగ్టేను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రాంచీలో ఆయన నివాసానికి చేరుకున్న సీఐడీ బృందం.. అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించింది. ఇటీవల JPSC నిర్వహించిన పరీక్షల్లో జరిగిన అవకతవకల్లో ఖియాంగ్టే పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. నిన్న ముగ్గురు కమిషన్ సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

టియర్ గ్యాస్ ప్రయోగం..

రాంచీ(Ranchi)లోని అసెంబ్లీ వద్ద బైఠాయించిన విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాంచీ సిటీ ఎస్సీ పరాస్ రానా మాట్లాడుతూ.. 90 శాతం మంది విద్యార్థులు శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నారని, మిగిలిన పది శాతం మంది అల్లర్లు చేయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాళ్ల దాడిలో ముగ్గురు పోలీసులను తీవ్రంగా గాయపడ్డారని.. అయినా తాము సంయమనంతోనే ఉన్నట్లు వివరించారు. విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరిస్తున్నామని, వారిపై ఎలాంటి కఠిన చర్యలకు దిగడం లేదన్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని.. ఓపికతో ఉండాలని కోరారు.

Also Read : ‘నరేంద్ర’ పేరుపై పాక్ బాక్సర్ ఏడుపు.. మోదీ నవ్వులు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>