కలం, వెబ్‌డెస్క్: రామ మందిర విరాళాల్లో (Ram Mandir Donations)జరిగిన అవకతవకలపై లోక్‌సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఆలయ విరాళాల అవకతవకల వ్యవహారంపై అత్యంత తీవ్రమైనదని ఆయన పేర్కొన్నారు. దీనిపై సభలో చర్చ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కుంభకోణంలో చాలా పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని, దర్యాప్తు చేసి పూర్తి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. భక్తుల పవిత్ర కానుకలకు రక్షణ కల్పించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆయన కోరారు.
మరోవైపు నేడు 16వ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 13 సమావేశాలు ముగియనున్నాయి. సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఎంపీలకు కాంగ్రెస్ సహా విపక్షాలు విప్ జారీ చేశాయి. లోక్‌సభ అధికారిక ఎజెండాలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ వంటి బిల్లులు లేవు. మరో మూడు రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ బిల్లులపై ఉత్కంఠ నెలకొంది.

