కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి (Erravalli) మండలం ధర్మవరం గ్రామ శివారులో ఆదివారం కోడి పందాల స్థావరంపై ఇటిక్యాల పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు ద్వి చక్ర వాహనాలు, ఆరు ఫోన్లు, రూ.10,500 నగదు, 12 కత్తులు, ఒక కోడి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇటిక్యాల ఎస్సై తెలిపారు.

