ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు లారీలు!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండల పరిధిలోని లక్ష్మీపురం వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన రెండు లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో లారీల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.​ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రహదారిపై వెళ్తున్న రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న తీవ్రతకు లారీల ముందు భాగాలు నజ్జునుజ్జయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే రహదారికి అడ్డంగా లారీలు నిలిచిపోవడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో కొద్దిసేపు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో ధ్వంసమైన లారీలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>