పిల్లలను బలిగొనేలా వీధి కుక్కల స్వైరవిహారం.. ఆందోళనలో బాన్సువాడ వాసులు!

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada)లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇద్దరు పిల్లలు మరో యువకునిపై దాడికి పాల్పడ్డాయి. సితార అనే మూడేళ్ల పాప, అలాగే ఖాలీద్ అనే ఆరేళ్ల బాబు, ఆఫ్రోజ్ అనే యువకునిపై దాడి చేసి గాయపరిచాయి. సితారకు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల వీధి కుక్కలు ఎనిమిది మందిని కరిచాయని స్థానికులు అంటున్నారు. బాన్సువాడలో వీధి కుక్కల బెడదతో పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపాలంటే తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. కుక్కల బెడదపై చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పిల్లల ప్రాణాలు పోయేంతవరకు చూస్తారా? అని బాధిత కుటుంబాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>