పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి కేసీఆర్.. కుటుంబ సభ్యులకు పరామర్శ

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR ) తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి చేరకున్న కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ రాకతో నల్లబెల్లికి భారీగా పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>