నేడు బోనాలు.. డప్పు చప్పుళ్లతో మార్మోగోతున్న భాగ్యనగరం

కలం, తెలంగాణ బ్యూరో: ఆషాఢ మాస బోనాల్లో అసలైన వేడుక ఆదివారం మొదలైంది. ఆఖరి ఆదివారం ఓల్డ్ సిటీలో లాల్దర్వాజాతోపాటు పట్నం మొత్తం బోనాలు సందడితో హోరెత్తనుండగా, గల్లీ గల్లీ రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోతున్నది. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం దద్దరిల్లుతోంది. హైదరాబాద్ (Hyderabad Bonalu), సికింద్రాబాద్ జంట నగరాల్లోని 26 ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో ప్రభుత్వం తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా, మీరాలం మండి ఆలయంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లాల్దర్వాజా సింహవాహిని ఆలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ పాల్గొననుండగా.. కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సుల్తాన్షాహి బంగారు మైసమ్మ ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వ తరఫున పాల్గొంటారు.

అంబర్ పేట మహంకాళి ఆలయంలో మంత్రి సీతక్క, సబ్జీమండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాంబక్షబండ బంగారు మైసమ్మ ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, భేలా ముత్యాలమ్మ ఆలయంలో మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, సుల్తాన్షాహి జగదాంబ ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్‌, గౌలిపుర మహంకాళి ఆలయంలో మంత్రి వాకిటి శ్రీహరి బోనాల ఉత్సవాలకు హాజరుకానున్నారు. హరిబౌలి నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయంలో ప్రభుత్వ సలహాదారు వీహెచ్ పాల్గొంటారు. మూసీ బ్రిడ్జి భూలక్ష్మి ఆలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో శాసనమండలి సభ్యుడు బి. మహేశ్ కుమార్‌ గౌడ్‌ ప్రభుత్వ తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>