కలం, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఫ్యామిలీతో పాటు చిన్న, పెద్ద అందరూ చూసేలా క్లీన్ ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికెట్ లభించింది.
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా(Vishwanath and Sons)లో మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ ఇంట విషాదం
Follow Us On: Instagram

