నిర్మల్‌లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. రావుల రాంనాథ్ పిలుపు

కలం, నిర్మల్: హర్ ఘర్ తిరంగాలో భాగంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా తిరంగా ర్యాలీలను విజయవంతం చేయాలని జోనల్ కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. శుక్రవారం నిర్మల్ (Nirmal) జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 13న జిల్లా కేంద్రంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేయాలన్నారు.

అలాగే ప్రతిఒక్కరూ తమ వాట్సాప్ డీపీలు, సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ చిత్రాలుగా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ గౌడ్, కౌన్సిలర్ సూరజ్ నాయక్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు డి. నిరంజన్ రెడ్డి, ధార్మిక సెల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్, నాయకులు అయిండ్ల సాత్విక్, నరేందర్, తోకల అనిల్, జుట్టు దినేష్, వెంకటేష్, దీక్షిత్ రెడ్డి, సృజన్, మధు, సుమిత్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>