కలం, కరీంనగర్ బ్యూరో : సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రెషర్స్ డే కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు (Vijaya Ramana Rao) హాజరై మాట్లాడారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సుల్తానాబాద్ లో నెలకొల్పుతున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇది ప్రారంభమవుతుందన్నారు.
ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలతో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇందులో విద్యాభ్యాసం ఉంటుందన్నారు. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ప్రభుత్వ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సుల్తానాబాద్ ప్రభుత్వ కాలేజీలో చదివిన వారు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. తాను కూడా ఇదే కళాశాలలో చదవడం గర్వంగా ఉందన్నారు. పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
కాలేజీని మంచి ఫలితాలతో క్రమశిక్షణతో నడుపుతున్న ప్రిన్సిపాల్ ను, అధ్యాపకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, బిరుదు కృష్ణ, జిల్లా లైబ్రరీ చైర్మన్, అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్, వైస్ చైర్మన్, పుష్పలత కమిషనర్, కౌన్సిలర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ కాంగ్రెస్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు.

