వనపర్తికి ఈఎస్ఐ ఆసుపత్రి కేటాయించండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లాలో కార్మికులు, అసంఘటిత రంగ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని (Minister Vivek) కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. వేలాది మంది ఈఎస్ఐ లబ్ధిదారులు వైద్య సేవల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఐటీఐ హబ్ మంజూరుపై కృతజ్ఞతలు..

వనపర్తికి రూ.241 కోట్లతో ఐటీఐ హబ్ మంజూరు చేసినందుకు మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) కృతజ్ఞతలు తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువల నిర్మాణంలో వెలికితీసిన రాళ్లను పారదర్శకంగా వేలం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని మంత్రిని కోరారు. అనంతరం రాళ్ల నిర్వహణ అంశంపై కాంట్రాక్టర్లు, ఫీల్డ్ నిర్వాహకులు, మైనింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాల్గొని పలు సూచనలు చేశారు.

Also Read : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రం ముద్రించాలి: మంత్రి అడ్లూరి విజ్ఞప్తి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>