కలం, వెబ్ డెస్క్ : కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Dam) వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు ద్వారా వరద ఉధృతి పెరగడంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ పరిణామంతో అధికారులు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుత సీజన్‌లో జలవిద్యుత్ ఉత్పాదన ప్రారంభం కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కొరత తీరి, సరఫరా వ్యవస్థకు గణనీయమైన ఊరట లభించనుంది.
Also Read : ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
Follow Us On: Instagram

