కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో (Ieeja Mandal) పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు గురువారం ఎస్ఐ గురుస్వామి ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకటారాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.9,910 నగదు, 5 సెల్ ఫోన్లు, 5 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుస్వామి తెలిపారు.

