కలం, నిర్మల్ : భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియన్ సెల్ ముంబై తెలుగు విభాగం అధ్యక్షుడిగా రమేష్ మంతెన (Ramesh Manthena) నియమితులయ్యారు. ఈ మేరకు సౌత్ ఇండియన్ సెల్ ముంబై అధ్యక్షుడు మురుగన్ ఆర్. సెల్వన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మంతెన మాట్లాడుతూ..
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముంబైలోని తెలుగు ప్రజలను పార్టీ సిద్ధాంతాలతో మరింత చేరువ చేసేలా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి, తెలుగు విభాగం కార్యకలాపాల విస్తరణకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు.

