కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ గా భవేష్ మిశ్రా (Bhavesh Mishra) గురువారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సెలవుపై వెళ్ళటంతో నిర్మల్ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈరోజు కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ఇంచార్జి కలెక్టర్ ను అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత తదితరులు సాదరంగా స్వాగతం పలికారు.
నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ ను వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

