కలం, వెబ్ డెస్క్: పుత్తడి ప్రియులకు బంగారం ధరలు (Gold Prices Today) దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. కొన్ని నెలల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గుతూ వచ్చాయి. ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది అని అనుకునేలోపే మళ్ళీ ధరలకు రెక్కలొచ్చాయి. గత మూడు రోజులు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే గురువారం గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,49,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,650 ఎగబాకి రూ.1,37,250గా ఉంది.
ఒకే రోజులో రూ.వేలల్లో ధరల పెరుగుదల చోటుచేసుకువడంతో బంగారం కొనేవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ.2,40,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు అమలులో ఉంటాయి. ఈ ధరలపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) 3శాతంగా అదనంగా విధిస్తారు.

