”రోడ్డు లేని ఊరు మాకేందుకు”.. కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ఆందోళన

కలం, ఆదిలాబాద్ : ఎయిర్ పోర్ట్ రోడ్డు మూసివేయడం కాదు.. ఊరిని కూడ ఎయిర్ పోర్ట్ కోసం సేకరించాలని కోరుతూ ఆదిలాబాద్ (Adilabad) కలెక్టర్ కార్యాలయం ముందు అనుకుంట గ్రామస్తులు బుధవారం అందోళన చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణం నుండి నుండి గ్రామానికి వెళ్లే రోడ్డును ఎయిర్ పోర్ట్ కోసం సేకరిస్తున్నారని, రోడ్డు లేకుంటే ఊరుకోమంటూ గ్రామస్థులు అందోళన చేపట్టారు.

ఎయిర్ పోర్ట్ రోడ్డు ను సేకరిస్తే గ్రామాన్ని కూడ తీసుకోవాలని అనుకుంట గ్రామస్తులు కోరారు. రోడ్డు లేని ఊరి మాకేందుకంటూ అధికారులను ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే. ఊరుకోమని గ్రామస్తులు అధికారులను హెచ్చారిస్తున్నారు. ప్రత్యామ్నాంగా దారి నిర్మిస్తామని అదికారులు చెబుతున్నా…. ఉన్నా దారిని కోనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.‌ ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నామని.. ప్రతిపాదిస్తున్నా ప్రత్యామ్నాయ దారితో పదహరు ‌కిలోమీటర్ల. దూరం పెరుగుతుందంటున్నారు. అదేవిధంగా ఎయిర్ పోర్ట్ కోసం సేకరించే భూములకు ఎకరాకు ఆరు కోట్ల రుపాయలు పరిహరం ఇవ్వాలని, అదేవిధంగా పద్దేనిమిది ఏళ్లుదాటిన వారందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>