కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా అన్నాసాగర్ (Annasagar) గ్రామంలో అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులకు (Internal Drainage Works) బుధవారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ భాగ్యశ్రీ రమేష్, 9వ వార్డు సభ్యురాలు బోయ వసంత చెన్నయ్య భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతే లక్ష్యంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొంటూ, అభివృద్ధి కార్యక్రమాల విజయానికి గ్రామ ప్రజలందరి సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రజిత శేఖర్, వార్డు సభ్యులు ఈశ్వరయ్య, కాజా జమారుద్దీన్, మైనారిటీ నాయకుడు షాకీర్, యువకులు శ్రీనివాసులు, శివకుమార్, మధుకర్, శశిబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : 2026లోనే సీనియర్ నేషనల్ చెస్ టోర్నీ.. AICF కీలక నిర్ణయం!
Follow Us On : WhatsApp

