యువకుడి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీసులు

కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) నగరంలోని అమ్మవారిపేట ఎక్స్ రోడ్ వద్ద మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మడికొండ పోలీసుల సమయస్ఫూర్తితో ఓ వ్యక్తి ప్రాణాలు దక్కాయి. కరీమాబాద్‌కు చెందిన మెరుగు పవన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న పెట్రో కార్ సిబ్బంది సంపత్, గోవర్ధన్ వెంటనే స్పందించి మంటలను ఆర్పారు.

అనంతరం జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్‌ఐ రాజబాబు, ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పవన్‌ను 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసుల సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>