కలం, ఖమ్మం బ్యూరో: రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పేకాటతో సహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా కారేపల్లి (Karepalli) పోలీస్ స్టేషన్‌ను సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఐ, ఎస్సై కార్యాలయాలతో పాటు జనరల్ డైరీ, కేసు డైరీలు, సీజ్ చేసిన వాహనాలు, విచారణ నివేదికలు, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా తక్షణమే స్పందించి న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
సీసీ టీవీ కెమెరాలపై అవగాహన..
పెండింగ్ కేసుల పురోగతి, నమోదైన కేసులు, డయల్ 100 కాల్స్ స్పందన సమయంపై సీపీ సునీల్ దత్ (CP Sunil Dutt) సమీక్ష నిర్వహించారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేరాలను నియంత్రించేందుకు సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. విధిగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ సాగర్, ఎస్సై గోపి, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : క్షుద్ర రాజకీయానికి తెరలేపారు.. కాంగ్రెస్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్
Follow Us On : WhatsApp

