టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు

కలం, వెబ్ డెస్క్ : బాపట్ల జిల్లా రేపల్లెలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కాపు వర్గానికి చెందిన కీలక నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు (Gudapati Srinivasa Rao) వైసీపీలో చేరారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న రేపల్లె పట్టణానికి చెందిన శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్‌లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో గూడపాటి శ్రీనివాసరావు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించిన ఆయనకు ప్రాధాన్యం లేకపోవడం, అధిష్టానం కొందరికే ప్రాధాన్యం ఇస్తున్న వేళ ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారని అనుచరులు అంటున్నారు. గూడపాటి శ్రీనివాసరావు మామ తాడివాక శ్రీనివాసరావు 2014 – 19 వరకు రేపల్లె మున్సిపల్‌ చైర్మన్‌గా సేవలు అందించారు. కాగా, గూడపాటి శ్రీనివాసరావు తాజాగా వైసీపీలో చేరడంతో టీడీపీకి కంచుకోటగా ఉన్న రేపల్లెలో రానున్న రోజుల్లో టీడీపీకీ వ్యతిరేకంగా రాజకీయ సమీకరణలు మారొచ్చనే ప్రచారం సాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>