కలం, కరీంనగర్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం వడ్డెర కాలనీ ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు మరణించిన విషయం తెలిసినప్పటి నుంచి విద్యార్థుల అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు జగిత్యాల జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ అడుగడుగునా బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు.
జగిత్యాల రూరల్ మండలం టీఆర్ నగర్ కి చెందిన సుశాంత్ 4వ తరగతి, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కి చెందిన విష్ణు 5వ తరగతి విద్యార్థులు మల్యాల ఎస్సీ హాస్టల్ లో ఉంటూ వడ్డెర కాలని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు బయటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే..
విద్యార్థుల మృతి పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచారం వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి చేతులు దులుపుకోలేదు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విధానంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
అంతేకాకుండా తక్షణ సహాయం కింద ప్రభుత్వం తరఫున రూ. 25వేల నగదు సహాయం అందించడంతోపాటు మృతదేహాలను జగిత్యాల నుండి వారి ఇంటికి తరలించడానికి అవసరమైన అంబులెన్స్ ప్రభుత్వం ద్వారా ఇప్పించారు. అంతర్ రాష్ట్ర పర్యటనలో ఉన్నప్పటికీ అనుకూలం బాధిత కుటుంబాలను సహాయం అందించాలని అధికారులను అప్రమత్తం చేస్తు మంత్రి అడ్లూరి తీసుకున్న చర్యల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

