రణరంగంగా ఏబీవీపీ స్టూడెంట్స్ మార్చ్

కలం, హనుమకొండ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్టూడెంట్స్ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్‌డీఎల్‌సీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్‌కు అనుమతి ఉండగా, విద్యార్థులు వరంగల్ (Warangal) కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. చివరికి పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటన నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>