కలం, సినిమా : నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘అలియాస్ రుక్మిణి’ (Alias Rukmini) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా నితిన్ (Nithiin) నటిస్తుండగా, దండోరా ఫేమ్ దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదలైన సందర్భంగా నాని సోషల్ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. “ప్రేమకథలు ఎప్పుడూ ప్రత్యేకమైనవే. కానీ వాటికి కొత్త తరహా నేపథ్యం, అద్భుతమైన నటీనటులు, ప్రతిభావంతమైన సాంకేతిక బృందం తోడైతే అవి చిరస్మరణీయంగా నిలుస్తాయి. నితిన్‌తో కలిసి మీరు అందరూ ప్రేమించే ఒక అందమైన చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇది అందరి మనసులు గెలుచుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాను నాని సమర్పణలో యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సోదరి దీప్తి గంటి నిర్మిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. నితిన్ కెరీర్లో మరో విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

