నూతన కౌన్సిలర్లు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి

కలం, నిర్మల్: బాగులవాడ మున్నూరు కాపు సంఘం (Munnuru Kapu Sangam) ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను ఆదివారం ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సముందర్‌పల్లి రమేశ్​, కార్యదర్శి అడప నవీన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ధర్మాజీగారి రమ్య ఈశ్వర్, సముందర్‌పల్లి రాజు, మంచాల శ్రీకాంత్ యాదవ్‌లను సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన కౌన్సిలర్లు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, కాలనీల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>