కలం, వలిగొండ : స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. దోస్త్ మేరా దోస్త్ తుహే మేరీ జాన్ అంటూ స్నేహితుల దినోత్సవం రోజున (Friendship Day) ప్రగతి కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల (1993-95) ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రగతి జూనియర్ కళాశాల ప్రథమ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు దాదాపు 33 సంవత్సరాల అనంతరం కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని ఆత్మీయ సమ్మేళనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాసుల వెంకన్న, పబ్బు వెంకటరమణ, గంధమల్ల స్వామి రాజ్, పైళ్ల ప్రకాష్ రెడ్డి, మల్లం వెంకటేష్, జగదీశ్వర్, నూతనగంటి వెంకటేష్, పబ్బు శ్రీలత పందిరి రమ, రజిత, చిట్టెడి అరుణ, ఎల్లంకి శ్యాంసుందర్, గట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.
Also Read : ఫామ్‌లోకి వచ్చిన అభిషేక్ శర్మ.. ఏకంగా 25 సిక్సర్లతో విధ్వంసం!
Follow Us On : WhatsApp

