సాయికృష్ణ కేసులో కీలక పరిణామం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు (Sai Krishna Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ4 గా ఉన్న నిందితుడు సురేశ్​ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. సురేశ్​ ఫోటో, వివరాలు విడుదల చేసి అతడి ఆచూకీ తెలపాలని కోరింది. కేసు నమోదైనప్పటి నుంచి సురేశ్ ఉద్దేశపూర్వకంగానే పరారీలో ఉన్నట్లు సిట్​ ఆరోపించింది. సురేశ్​ను అరెస్ట్​ చేసేందుకు సిట్​ ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతుందని పేర్కొంది.

నిందితుడి ప్రస్తుత ఆచూకీ, సంచార ప్రాంతాలు లేదా అతడు తలదాచుకున్న ప్రదేశానికి సంబంధించిన ఏదైనా విశ్వసనీయ సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. చిన్న సమాచారం కూడా నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా మారవచ్చని తెలిపింది. పరారీలో ఉన్న నిందితుడికి తెలిసి ఆశ్రయం కల్పించడం, దాచిపెట్టడం, సహాయం చేయడం లేదా ఏ విధంగానైనా సహకరించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. నిందితుడి గురించి తెలిసిన వారు ధైర్యంగా సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సిట్​ తెలిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>