నీటిలోనూ ప‌ని చేసే రోబో.. చైనా స‌రికొత్త సృష్టి!

క‌లం, వెబ్‌డెస్క్‌: రోబో ప్ర‌పంచంలో చైనా (China) మ‌రో కొత్త ఆవిష్క‌ర‌ణ‌కు నాంది ప‌లికింది. భూమి పైనే కాకుండా నేల‌పైన కూడా న‌డిచే స‌రికొత్త రోబో (Robot) ను సృష్టించింది. ఈ రోబో గోళాకారంలో ఉండి, ఇత‌ర రోబోల కంటే విభిన్నంగా ఉంది. దీని క‌ద‌లిక‌లు కూడా సాధార‌ణ రోబోల కంటే కాస్త వేరుగానే ఉన్నాయి. ఇది భూమిపై గంట‌కు 35 కిలో మీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. అలాగే 4 ట‌న్నుల వ‌ర‌కు ప్ర‌భావాన్ని త‌ట్టుకోగ‌ల‌ద‌ని దీని రూపొందించిన సైంటిస్టులు తెలిపారు.

ఇది అత్య‌ధిక , అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌ల్లోనూ బాగా ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. -25 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 65 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు ఉష్ణోగ్రతల్లో పని చేసే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఎలాంటి క‌ఠిన ప‌రిస్థితుల్లోనైనా ఈ రోబోలు ప‌ని చేస్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం సెక్యూరిటీ, స‌హాయ కార్య‌క్ర‌మాలు, త‌నిఖీల కోసం ఈ రోబోల‌ను వినియోగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>